ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్‌మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెనిన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయినట్లుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్‌షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు.
లిబియాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచేశాయి. డేనియల్ తుపానుతో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపు పావు వంతు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.