హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెనిన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయినట్లుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్‌పై ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతున్న దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని హమాస్ పిలుపునిచ్చింది. పాలస్తీనా సాయుధ గ్రూపులకు కంచుకోటగా పేరొందిన జెనిన్‌లో ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త అప్డేట్.. అందుకే దాడి!
అయితే ఇటీవల ఖతర్, అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరగడంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పులకు విరామం లభించింది. అంతేకాకుండా హమాస్.. బందీలను కూడా విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనీయుల్ని కూడా విడుదల చేసింది. మొత్తానికి కొద్దిరోజుల నుంచి ఇరు దేశాల మధ్య బాంబుల మోత తగ్గింది. తాజాగా జెనిన్‌పై ఐడీఎఫ్ దాడి చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హమాస్ వెల్లడించింది. మళ్లీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Janasena: జనసేనకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్..