RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది.
Karnataka: కర్ణాటకలోని మంగళూరులోని ఓ కోర్టు హత్య నిందితుడికి మరణశిక్ష విధించింది. తన ముగ్గురు పిల్లలను హతమార్చి, భార్యను బావిలోకి తోసి చంపేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…
West Bengal: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన 19 ఏళ్ల నిందితుడికి పశ్చిమ బెంగాల్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 61 రోజుల తర్వాత నేరారోపణ రుజువు కావడంతో అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్‌లో అక్టోబర్ 04న 9 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ముస్తాకిన్ సర్దార్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అదే…
RG Kar ex-principal:కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ స్పెషల్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. సందీప్ ఘోష్ కి బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం రుజువైతే మరణశిక్ష తప్పదని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వెల్లడించింది.
Laila Khan Murder Case: 13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది.…
Iran: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఇటీవల కాలంలో ఉరిశిక్షలను విధించడం ఎక్కువ చేసింది. ఇస్లామిక్ చట్టాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఇరాన్ మరణశిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 834 మందికి మరణశిక్ష విధించిందని, 2015 తర్వాత ఇదే అత్యధికమని హక్కుల సంఘాలు మంగళవారం తెలిపాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇరాన్ ఉరిశిక్షల సంఖ్య 2022 నాటికి 43 శాతం పెరిగింది.
Shah Rukh Khan: ఖతార్లో గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో భారత్ దౌత్యపరంగా ఖతార్పై ఒత్తిడి తీసుకురావడంతో 8 మందిని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదలతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సాయం చేశారని, వారి విడుదలకు ఖతార్ ప్రభుత్వాన్ని ఒప్పించారని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ‘‘ఖతార్లో షేక్లను భారత విదేశాంగా శాఖ, ఎన్ఎస్ఏ ఒప్పించడంలో విఫలం…