ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్.. తమ విజయ రహస్యం ఏంటో చెప్పాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మొదటి బంతి నుంచే దాడి చేయాలని తాము ముందే నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కుల్దీప్ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఒకసారి రిథమ్‌లోకి వస్తే మ్యాచ్‌నే నియంత్రించగలడని, అందుకే అతడిని మొదటి బంతి నుంచే ఒత్తిడిలోకి…