నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది.
Telangana : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగంలో మరోసారి అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MRB) డాక్టర్లకు శుభవార్తను అందించింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు , ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ఎంఎన్‌జేలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ…
Damodara Raja Narasimha : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు.
నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
Damodara Raja Narasimha : ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడటం ఇప్పుడేమో, అయితే గత పదేళ్ల పాటు ఈ పథకాన్ని నిర్లక్ష్యంగా నిర్వహించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. Komatireddy Venkat Reddy : రేపు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి…
Telangana Ministers: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,దామోదర రాజ నర్సింహ పర్యటించనున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఇద్దరు మంత్రులు బాగిద్దిపేట చేరుకుంటారు.
Cabinet Meeting: నేడు (బుధవారం) తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 1 గంటకు ధాన్యం కొనుగోలు పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రులు అధికారులతో మంతనాలు జరగనున్నాయి. అలాగే నేటి సాయంత్రం 3 గంటలకు ఎర్రమంజిల్ లోని జలసౌదలో నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖా సమీక్ష సమావేశం జరగనుంది. ఈ…