తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం…
రేవంత్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు. అనంతరం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఉత్సహం కనిపిస్తుంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని 2014, ఆగస్ట్ 15 న సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ఆరేండ్లు అయిన.. దళితులకు భూములియ్యలేదు. దళితులకు భూములు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. టీఆర్ఎస్.. 2018 నుండి ఎక్కడ ఎన్నికలు వచ్చిన డబ్బు వెదజల్లుతుంది…