జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ క్రమంలోనే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడా వెల్లడించారు. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదని జూడాలు అంటున్నారు.
ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నేటితో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
MLA Kranti Kiran: మెదక్ జిల్లాలో దళితబంధు లొల్లి షురూ అయ్యింది. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Congress Politics టీ కాంగ్రెస్లో గాలి దుమారం… ఇద్దరు సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా? పదవి విషయంలో వచ్చిన పొరపచ్చాలు.. పంతాలు అగ్గి రాజేస్తున్నాయా?. ఇంతకీ ఏంటా వైరం? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..! నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తెలంగాణ కాంగ్రెస్లో కామన్. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది లేదు. భేదాభిప్రాయాలతోనే సమస్య. పార్టీలో ఇదే ఇప్పుడు తలనొప్పి. పీసీసీ చీఫ్ రేవంత్కి సన్నిహితంగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర…