Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్‌ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్‌గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు…