Today (22-12-22) Business Headlines: ఆజాద్ ఇంజనీరింగ్ స్పెషల్ యూనిట్: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ.. జపాన్ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం స్పెషల్ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్ లేదా గ్యాస్ ఎయిర్ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది.