(జూలై 15న డి.వి.నరసరాజు జయంతి) డి.వి.నరసరాజు పెద్ద మాటకారిగా అనిపించరు కానీ, ఆయన పాత్రలు మాత్రం మాటలతో తెగ సందడి చేస్తుంటాయి. అట్లాగని అదేపనిగా ప్రాసల కోసం ప్రాయస కూడా కనిపించదు. జన సామాన్యంలోని పదాలతోనే అదను చూసి పదనుగా కలాన్ని పరుగులు తీయించడంలో మేటి డి.వి.నరసరాజు. తెలుగు పలుకుబడిని ఉపయోగించడంలో నరసరాజు అందెవేసిన చేయి. పాత సామెతలను సైతం పట్టుకువచ్చి సందర్భోచితంగా ప్రయోగించేవారు. నాటకరంగంలోనే నరసరాజు బాణీ భళా అనిపించుకుంది. ఆయన ప్రతిభ చూసిన దిగ్దర్శకులు…