ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయం ఆదా కోసం ఎక్కడికైనా వెళ్లాలంటే బైకులు, స్కూటర్లు, కార్లను ఉపయోగిస్తున్నారు. దీంతో శారీరక శ్రమకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో అనేక జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో అంతా వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాకింగ్, జిమ్ లకు వెళ్లడం, యోగా వంటివి చేస్తున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం సైకిల్ తొక్కడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కేవలం 10…
సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. వైద్యులు కూడా సైకిల్ తొక్కడాన్ని వ్యాయామంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సైకిళ్ల వినియోగం పెరిగింది. మార్కెట్ లో సాధారణ సైకిల్స్ తో…
పార్వతీపురం మన్యం జిల్లాలో గత సంవత్సరాలుగా ఓ ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. ఈ విషయంకాను ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. ఆ రైతు చేసిన నిరసనకు జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఓచోట రైతుల ఆస్తులు, పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడగా, అనేకమంది గాయాల పాలయ్యారు. జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలలో కొన్ని…
సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగానికి గురిచేసే వీడియోలు ఉంటాయి. అందులో ఇదొకటి.. జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనిని ముగించి.. చీకటి పడ్డాక తన భార్య, కొడుకుతో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు వేసుకున్న వ్యక్తి పిల్లాడిని ఎత్తుకుని నడుస్తుండగా.. అతని భార్య సైకిల్ పట్టుకుని ముందుకు వెళ్తుంటారు.
సాధారణంగా ఎద్దులు ఎవరిపై దాడులు చేయవు. తన పనితాను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా దానికి హాని తలపెట్టాలని చూస్తే దాడి చేస్తుంది. అయితే, ఓ సైకిల్ రైడర్ తన దారిన తాను సైకిల్ తొక్కకుంటూ వెళ్తుండగా హటాత్తుగా ఓ ఎద్దు దాడి చేసింది. ఎందుకు అలా దాడి చేసిందో తెలియదు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ జరుగుతుండగా ఓ ఎద్దు దాడి చేసింది. అందులోనే ఒక వ్యక్తిపై మాత్రమే దాడి చేసింది. ఆ…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని…
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధర 150కి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్రోల్ ధరలు భరాయించలేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన పబ్లిక్ సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా, కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువతకు బైక్‌లంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో యువత కొత్తగా ఆలోచించి నూతనంగా బండ్లను తయారు చేసుకుంటున్నారు. Read: పాక్ లో 5వేల ఇండియా…