సాధారణంగా ఎద్దులు ఎవరిపై దాడులు చేయవు. తన పనితాను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా దానికి హాని తలపెట్టాలని చూస్తే దాడి చేస్తుంది. అయితే, ఓ సైకిల్ రైడర్ తన దారిన తాను సైకిల్ తొక్కకుంటూ వెళ్తుండగా హటాత్తుగా ఓ ఎద్దు దాడి చేసింది. ఎందుకు అలా దాడి చేసిందో తెలియదు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ జరుగుతుండగా ఓ ఎద్దు దాడి చేసింది. అందులోనే ఒక వ్యక్తిపై మాత్రమే దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాంతం ఎత్తి కిందపడేసింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలుదు. రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఎద్దు యజమాని దానిని దూరంగా తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అక్కడికి వచ్చి దాడి చేసింది. ఎందుకు అలా చేసిందో ఆ యజమానికి కూడా తెలియలేదు. దీనికి సంబంధించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: Hyderabad: కర్మన్‌ఘాట్ వద్ద ఉద్రికత్త… భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్ట్…