ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయం ఆదా కోసం ఎక్కడికైనా వెళ్లాలంటే బైకులు, స్కూటర్లు, కార్లను ఉపయోగిస్తున్నారు. దీంతో శారీరక శ్రమకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో అనేక జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో అంతా వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాకింగ్, జిమ్ లకు వెళ్లడం, యోగా వంటివి చేస్తున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం సైకిల్ తొక్కడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు.. గోల్డెన్ బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
Also Read:Sri Rama Navami : పట్టు చీరలో శ్రీరామ నామం.. నేతన్న శ్రద్ధార్చన
ఒత్తిడిని తగ్గిస్తుంది
సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి ఉదయపు తాజా గాలిలో సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు రోజంతా ఉల్లాసంగా ఉన్నట్లు భావిస్తారు.
Also Read:Tata EV Discount 2025: టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది
మీరు సైకిల్ తొక్కేటప్పుడు, మీ శ్వాస సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించి శరీరానికి సరిగ్గా అందించడానికి సహాయపడుతుంది.
Also Read:IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మీరు ప్రతిరోజూ సైకిల్ తొక్కితే, అది శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Also Read:Xiaomi QLED TV X Pro Series: గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..
నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరచండి
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది నిద్రలేమి సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.