పార్వతీపురం మన్యం జిల్లాలో గత సంవత్సరాలుగా ఓ ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. ఈ విషయంకాను ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. ఆ రైతు చేసిన నిరసనకు జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఓచోట రైతుల ఆస్తులు, పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడగా, అనేకమంది గాయాల పాలయ్యారు. జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏనుగులు గుంపుగా ఏనుగుల సంచరిస్తూ ప్రజలని బెంబేలెత్తిస్తున్నాయి.
Also Read: Virat Kohli-IPL Title: ఆర్‌సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం: విరాట్ కోహ్లీ
ఆ ప్రాంతాలలోని ప్రజలు సాయంత్రం తర్వాత ఇంటి నుండి బయటకు రావాలంటేనే గుండెల్లో వణుకు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇదే క్రమంలోనే ఓ ఏనుగుల గుంపు మరోసారి కొమరాడ మండలం గారవలస ప్రాంతంలో రెచ్చిపోయాయి. ఇందులో భాగంగానే గారవలస గ్రామానికి చెందిన వెంకట నాయుడు అనే ఓ రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండించినవాటిని., సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్ పై తీసుకెళ్లి అమ్ముకొని అతని కుటుంబం జీవనం సాగిస్తుంది.
Also Read: Ram Charan: కూతురితో కలిసి బీచ్ లో సందడి చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..
ప్రతిరోజు లాగే ఉదయాన్నే తన గ్రామం నుండి కూరగాయలు సైకిల్ పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి సడన్ గా పంట పొలాల్లో నుండి ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. అదే విషయంలో అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసాయి. దాంతో వెంకట నాయుడు సైకిల్ ను రోడ్డు పైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే ఏనుగుల దాడిలో అక్కడే ఉన్న ఓ సైకిల్ ను ధ్వంసం చేశాయి. దీంతో తమ జీవనోపాధి అయిన సైకిల్‌ను చూసి రగిలిపోయాడు. దింతో ఎలాగైనా సరే తనకు జరిగిన అన్యాయం పై అధికారులతో మాట్లాడాలని అనుకున్నాడు. దింతో అతను ధ్వంసమైన సైకిల్ ను భుజాన వేసుకొని సుమారు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్న కలెక్టర్ ని కలిసి తన సైకిల్ ను చూపించి మీ అధికారుల వల్ల తనకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దెబ్బకి కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒకింత షాక్ గురయ్యాడు. అక్కడే తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనీ, తక్షణమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఆ పెద్ద రైతు పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చి.. వెంటనే వెంకటనాయుడును ఆదుకోవాలని సదరు అధికారులకు ఆదేశించారు.