Cyber Fraud With Delhi High Court Justice Satish Chandra Sharma WhatsApp DP: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్తలు సూచిస్తున్నా.. అవి ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. జనాలకు కుచ్చటోపీ వేస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల్ని నిలువునా దోచేస్తున్నారు. జనాలు పక్కాగా నమ్మేలా, కొత్త కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సాప్ డీపీతోనే…
సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు జనాల్ని బుట్టలో పడేద్దామా? టోకరా వేద్దామా? అంటూ నిత్యం కాచుకొని ఉంటారు. ఇందుకోసం వాళ్లు చేయని ప్రయత్నాలు, రచించని వ్యూహాలంటూ ఉండవు. లక్షల్లో, కోట్లలో ప్రైజ్మనీ గెలుచుకున్నారంటూ.. తమ ట్రాప్లో పడేసేందుకు ట్రై చేస్తారు. ఇలా ఎంతోమంది టెంప్ట్ అయ్యి, లక్షలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారి కూడా అలాగే మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, లక్షల రూపాయల్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్లకు…
కరెంట్ బిల్లు పేరుతో లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన హైదరాద్లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకి చెందిన వ్యక్తి ఫోన్ కి కరెంట్ బిల్లు కట్టాలని, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. అయితే దీంతో ఖంగుతిన్న అతను అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుకి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్ కి ఫోన్ చేశాడు. దీంతో కేటుగాళ్లు…
ఆన్లైన్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే చాలా ముందుకు సాగినప్పటికీ, సైబర్ మోసాల కేసులు పూర్తిగా పెరిగాయి. అయితే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఒకపైసా కారణంగా సైబర్ వల నుంచి బయటపడ్డాడు. గ్రేటర్ నోయిడాలోని డారిన్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 9,999.99 ఉన్నందున రూ. 10,000 ఆన్లైన్ మోసం నుండి రక్షించబడ్డాడు. ఈ సంఘటన జూన్…
సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ నేరగాడు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఎంపీ సంజీవ్ కుమార్ కు ఫోన్ వచ్చింది.…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేట మోతీనగర్కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు.…
Fake messages in the name of Collector Suryakumari కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ గురించి తెలియని వారి నుంచి ఇంతో అంతో తెలిసిన సామాన్యుడి వరకు ఏదో ఒక రూపంలో సైబర్ దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది వారి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారే డబ్బు…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్లను కూడా వదలడం లేదు. పబ్లిక్ సర్వెంట్లు, ప్రజాప్రతినిధుల పేర్లో అమాయలకు టోకరా వేస్తున్నారు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ ఎఫ్బీ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలర్ట్ అయ్యారు. తన అనుచరులందరినీ అప్రమత్తం చేశారు. ‘‘నా పేరు మీద ఎవరో…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేటుగాళ్ల వలలో చిక్కి ప్రజలు లక్షలు మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా రెండు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ అకౌంట్కు చెందిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని సదరు మహిళను చీటర్స్ భయపెట్టారు. దీంతో నిజమని నమ్మిన ఆ మహిళ బ్యాంకు…
నకిలీ కాల్ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ళ వ్యవధిలో 1000 కోట్లు మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో ఈ ముఠా కార్యకలాపాలు నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ను టార్గెట్గా చేసుకొని బురుడి కొట్టించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. యూకే , ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల క్రెడిట్ కార్డ్ లకు ఇండియా బ్యాంక్లు…