ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్స్ హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే.. తమిళనాడులోని మరో ఆస్పత్రి సైబర్ దాడికి గురి కావడం గమనార్హం. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌లోని 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లు, డేటాబేస్‌లను విక్రయించడానికి ఉపయోగించే టెలిగ్రామ్ ఛానెల్‌లో విక్రయించారు.