'ప్రజాగళం' సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కటౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
IND Vs SA: కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం నాడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అటు విరాట్ కోహ్లీ అభిమానులు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు పోటాపోటీగా కటౌట్లు ఏర్పాటు చేయడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలో తొలుత విరాట్ కోహ్లీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు.…