భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 13వ రోజు (12-11-2022)- కార్తిక శనివారం కార్యక్రమాలు
* శంఖారావంతో ప్రారంభమైన పదమూడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ అలిమేలుమంగ సర్వయ వేదపాఠశాల, బుద్వేల్
* సంకష్టహర చతుర్థి శుభవేళ ఈ ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయమవుతుంది
* భక్తి గీతాలు : తి.తి.దే బృందం
* కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి హారతి వీక్షణం.. అష్టైశ్వర్య ప్రదాయకం
* కోటి దీపోత్సవంలో పదమూడవ రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనామృతం
* సర్వాభీష్టాలు సిద్ధింపజేసే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి కోటి తమలపాకుల అర్చన
* నేత్రపర్వంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం
* నాగసాధువులచే అత్యద్భుత మహారుద్రాభిషేక వీక్షణం.. సర్వదోష నివారణం
* ఒంటిమిట్ట కోదండరాముని సూర్యప్రభ వాహన సేవను తిలకిస్తే.. సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి
* విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం
* విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం
* నేటి అతిథి : తెలంగాణ ఆర్.టి.సి. ఎం.డి శ్రీ వి. సి. సజ్జనార్
* మన జీవితంలోకి జ్ఞాన వెలుగులు తీసుకువచ్చే కార్తిక దీపారాధన
* తల్లిదండ్రుల చుట్టూ గణపతి ప్రదక్షిణ చేసి పొందిన ఫలితం మీరు పొందాలంటే ఈ బంగారు లింగోద్భవాన్ని తప్పక చూడండి
* మహిమాన్వితమైన ఈ హారతిని కళ్ళకద్దుకుంటే నరఘోష, దిష్టిఘోష మీ కుటుంబంపై పడదు
* కార్తికమాసంలో ఈ మహా నీరాజనం వీక్షిస్తే పాప పరిహారం జరుగుతుంది
* శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ వారికి గురు వందనం
* భరతనాట్యం : స్మితామాధవ్ బృందం
* ఒడిస్సీ నృత్యం : ప్రజ్ఞామిశ్రా బృందం
* ఆంధ్రనాట్యం : ప్రియ బృందం
* శివతాండవ నృత్యం : న్యూఢిల్లీ బృందం
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి – వేద స్వస్తి