దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్…