తెలంగాణలో త్వరలోనే బార్ లైసెన్స్‌ల గడువు ముగియనుంది.. ఇక వైన్ షాపుల గడువు వచ్చే నెల ముగియబోతోంది.. ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ల లైసెన్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. 2021 – 22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించి చర్చించారు.. ఇక, ఏ4 వైన్ షాప్ ల లైసెన్సుల గడువు…
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలో అన్ని…
పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ వ్యవస్థపై వారికి అవగాహన కల్పించారు సీఎస్. ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని… భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి… సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. మరోవైపు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు మాత్రం ఆందోళన కలగిస్తున్నాయి.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… కరోనా థర్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూడదన్నారు. థర్డ్ వేవ్ ముప్పు రాదన్న ఆయన.. అయితే, ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వస్తే.. ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని…
దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష జరిగింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బ్యాంకు లింక్ ఉండదు కుటుంబ బ్యాంకు ఎకౌంటు నెంబర్ కు డైరెక్ట్ గా పడతాయి. గ్రామస్థాయి నుండి స్టేట్ వరకూ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. దళితుల బంధు స్కిమ్ కోసం ఎవరు డౌట్స్ పడాల్సిన అవసరం లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటాము. ఈనెల 16…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు కాదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని తెలిపిన ఏజీ.. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచ లేక పోయామన్న సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని కోరారు.…
సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని స్ధానిక సంస్ధల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బస చేసి పారిశుధ్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓ లు, డిఆర్ డిఓ లు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన…
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతోంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్‌బుక్ కూడా చేతిలో పెట్టేస్తున్నారు అధికారులు.. అయితే, ధరణిలో కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, వాటి పరిష్కారానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. దీంతో.. ఆ సమస్యలు త్వరితగతిని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.. ధరణి కి సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు తాజాగా.. వాట్సాప్, ఈ మెయిల్‌ను…
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేసి నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని తెలిపారు.. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైందని..…