20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి… అమ్మితే వివరాలు ధరణి లో లేవు. 20 ఏళ్ళ తర్వతా కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ తప్పుడు నిర్ణయాల వల్ల నిన్న హత్యలు జరిగాయి. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏంటో..? ధరణిని అడ్డం పెట్టుకొని… హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నమూనా పోయింది.బీహార్ నమూనా వచ్చేసింది. కేసీఆర్…
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన…
ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద ఆరు లేన్‌ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు.…
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల…
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ శనివారం నాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జనవరి 10 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ జీవోను జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. Read Also:…
తెలంగాణ రాష్ట్రలో ఉద్యోగ దంపతుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా భార్యభర్తలు ఒకే చోట పని చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కొత్త జోనల్ కేటాయింపుల్లో చేరిన తర్వాతే ఉద్యోగుల్లో ఉండే భార్యభర్తలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త జోనల్ వ్యవస్థ కేటాయింపులు అయిన తర్వాతే భార్య భర్తల బదిలీ విషయంలో ఆలోచిస్తామని…
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్ట్. జరిమానా కూడా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టు విచారణ జరిగింది. జీవో 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సీఎస్ ను ఆదేశించింది హైకోర్టు. అయితే కౌంటర్లు దాఖలు చేయనందుకు సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హాజరు మినహాయింపు…
ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు, అవసరమైతే శాఖాధిపతుల సలహా తీసుకోవాలని తాజా ఉత్తర్వులు…