న్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా.. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్ చేసిన రోజా దీని కోసం నోరు ఇప్పలేదే.. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బుద్ధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.
టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదు అంటూ విమర్శించారు.
విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన…
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 350 కి పైగా కోట్ల రూపాయలు దోచేశారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి భయం పరిచయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాకు రోగాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని వేడుకుని చంద్రబాబు బయటకు వచ్చాడు.
ఎన్డీయే ప్రభుత్వం DNAలోనే తెలంగాణ రాష్ట్రంపై విషం నింపుకునీ ఉన్నది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము.. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. తెలంగాణ పుట్టుకను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు?.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని తెలిపారు.
మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని చాలా మంది వచ్చి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే ప్రయత్నాలు చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాల్క సుమాన్ అన్నారు.