తెలంగాణ ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు గుప్పించారు. ఏసీడీపీ నిధులు ఆపారు.. అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు.
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు.
జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏదేదో వాగాడు.. పవన్ ప్యాకేజీ స్టార్... సిగ్గు, బుద్ధి లేదా పవన్ కి.. మాయావతి కాళ్ళు పట్టాడు.. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.