Hyderabad: తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాలా తెలివిగా వ్యవహరిస్తు్న్నారని.. అందుకే బడ్జెట్‌ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొలేని హామీలిచ్చారని భట్టికి కూడా తెలుసు అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ కాదు కదా.. దేశ బడ్జెట్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే ఏడాదికి లక్ష యాభై వేల కోట్లు కావాలన్నారు. ఏటా మహాలక్ష్మి పథకానికి 17 వేల కోట్లు కావాలని.. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉన్నాయని.. బడ్జెట్లో కేటాయించిన నిధులు మాత్రం నిల్‌గా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని..
ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు ఇందిరమ్మ పేరే కాకుండా వాజ్‌పేయ్ పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని కోరారు. ఆర్థికంగా రాష్ట్రo నిర్వీర్యం అయ్యిందని చెబుతున్నారు.. మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పాలని నిలదీశారు. మీరు కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తారా…? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు