ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
భద్రాచలం చర్ల మండల కేంద్రంలోని పాత చర్ల మామిడి తోటలో మందు పాతర పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టు వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ చత్తీస్ఘడ్ సరిహద్దు లోని పలు ప్రాంతాలలో పోస్టర్లు వేశారు మావోయిస్టులు. సమీపంలోకి వచ్చిన ఒక యువకుడు ఆ పోస్టర్లు ని చూస్తున్నాడు. అయితే అక్కడ మావోయిస్టులు వదిలివెళ్లిన మ్యాగజైన్ పేలిపోయింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా., బైక్ ధ్వంసమైంది. స్థానికులు బాధితుడు్ని…
ఉప్పల్ లో ఘరానా మోసాలకు పాల్పడ్డాడు ఓ పాస్టర్. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఆ కీచక పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే…. ఉప్పల్ లోని గాస్పల్ చర్చి కు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు… కొన్ని టీవీ ఛానళ్లలో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్.…
అమరావతి : బోగస్ చలాన్ల కుంభకోణంతో అలెర్టైంది ఏపీ ప్రభుత్వం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తరహాలోనే మరి కొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. చలానాల రూపంలో ప్రజలు చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరుతుందా..? లేదా అనే అంశంపై వివరాలు సేకరిస్తోన్న అధికారులు… ఎక్సైజ్, మైనింగ్, రవాణ, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరేందుకు జాప్యం జరుగుతోందని గుర్తించిన…
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు మండలాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తలుపుల మండలం లో 142.2. మిల్లీమీటర్ల నమోదు కావడంతో తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండి పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ…
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురం లో నాగయ్య – నాగమ్మ అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. తెల్లవారు జామున వారు ఇంట్లో నిద్రి స్తుండగా హత్యకు పాల్పడ్డాడు హంతకుడు వీరయ్య. అయితే…ఈ ఘటన లో మృతి చెందిన వారికి నిందితుడు వీరయ్య కొడుకు వరుస అవుతాడని తెలుస్తోంది. మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెద్దనాన్న నాగయ్య లను హత్య చేసినట్లు స్థానికులు…
గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీకూతుళ్లను సొంత చిన్నాన్న కొడుకే కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతుళ్లు వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూషను నిందితుడు శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. . దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలను వీడియో తీశారు చుట్టపక్కల వాళ్లు. కత్తితో పొడుస్తున్న దుర్మార్గుడితో తల్లీకూతుళ్లు పెనుగులాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా…
దేశంలో ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో పంచాయతీల్లో ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉంటుంటారు. ఎంతటి కఠిన శిక్షలు విధించినా మౌనంగా భరిస్తుంటారు. ఓ అత్త తక కోడలిపై బాబా దర్బార్‌కు ఫిర్యాదు చేసింది. బాబా దర్భార్ తనదైన శైలిలో కోడలకు వింత శిక్షను అమలు చేశారు. అందరిముందు కోడలు నిప్పుల్లో నడిచి నిరూపించుకోవాలని అన్నారు. చెప్పినట్టుగానే కోడలు నిప్పుల్లో నడిచింది. అయితే, ఈ తతంగాన్ని కొంతమంది సోషల్ మీడియాలో…
బెజవాడ అరండల్‌పేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రాఖీ పండగనాడు తమ్ముడికి రాఖీ కట్టి వెళ్లిన ఆమె ఆ తర్వాత రెండు గంటలకే చనిపోయినట్టు కబురందింది. అయితే అత్తింటివారే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు ఉష, ఫణి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే..! ఉష ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అన్నీ సర్దుకున్నాయ్ అన్న సమయంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయన్నది ఆమె తల్లిదండ్రుల…
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…