హైదరాబాద్ లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పాపిరెడీ కాలనీ లోని ఓ సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడి అరవింద్ (7) అనే బాలుడు మృతి చెందాడు. నిన్నటి నుండి బాలుడు కనిపించడం లేదంటూ చందనగర్ పోలీసులకు బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… బాలుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పాపిరెడీ కాలనీ లోని సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న బాలుడిని శవం బయటకు తేలడం గమనించారు స్థానికులు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సెప్టిక్ ట్యాంక్ లో మృతి చెందిన బాలున్ని అరవింద్ గా గుర్తించిన పోలీసులు…బాలుడి మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు….