కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
- పోవా 8 ప్రో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఆగస్టు 18న లాంచ్..
- ఫోన్లో ప్రత్యేకమైన ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే (Alive Matrix Display)..
- స్మార్ట్ఫోన్లకు భిన్నంగా వెనుక భాగాన్ని ఫంక్షనల్ విజువల్ ఎలిమెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POVA 8 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోవా (POVA) నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ పోవా 8 ప్రో (POVA 8 Pro)ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జూన్‌లో POVA 8ను లాంచ్ చేసిన సంస్థ.. ఇప్పుడు మరింత ప్రత్యేకమైన డిజైన్‌తో పోవా 8 ప్రో ను తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 18న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది.
POVA 8 Proలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాల్సింది ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’ (Alive Matrix Display)ను అందిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ఫోన్ల వెనుక భాగం కెమెరా మాడ్యూల్, డిజైన్‌కు మాత్రమే పరిమితమవుతుంది. అయితే 8 ప్రో లో వెనుక ప్యానెల్‌ను కూడా యాక్టివ్ విజువల్ ఎలిమెంట్‌గా ఉపయోగించేలా ఈ కొత్త డిస్ప్లే వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా వెనుక భాగంలో వివిధ రకాల ప్యాటర్న్ లేదా నోటిఫికేషన్ లను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ఈ కొత్త డిజైన్ పోవా రూపొందించిన “రూమ్ నోటీసిస్” కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను దూరం నుంచే ప్రత్యేకంగా గుర్తించేలా, సాధారణ ఫోన్లకు భిన్నమైన విజువల్ డిజైన్‌ను అందించడం ఈ కాన్సెప్ట్‌లో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్‌ను టేబుల్‌పై స్క్రీన్ కిందివైపు ఉంచినప్పటికీ.. వెనుక భాగంలోని విజువల్ ఎలిమెంట్ ద్వారా యూజర్ దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. వెనుక ప్యానెల్‌కు కేవలం డిజైన్ పరంగానే కాకుండా ఫంక్షనల్ ఉపయోగాన్ని కూడా కల్పించారు. నోటిఫికేషన్లు లేదా ఇతర విజువల్ ఎఫెక్ట్‌లను వెనుక భాగంలో చూపించడం ద్వారా సాధారణ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌కు భిన్నమైన అనుభూతిని అందించనుంది.
అయితే ప్రస్తుతం POVA 8 Proకు సంబంధించిన కెమెరా వివరాలు, ప్రాసెసర్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్, బ్యాటరీ సామర్థ్యం, ధర వంటి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఆగస్టు 18న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్లో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియనుంది. మొబైల్ ధర మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Built for accidental drops, unexpected splashes, and everyday chaos. 🛡️😎
TECNO POVA 8 Pro 5G is ready for whatever comes next.
Dropped it? Splashed it? Keep going.#POVA8Pro5G #LightUpYourPower #TECNOAI pic.twitter.com/aOfElyNzgo— tecnomobile (@tecnomobile) August 13, 2026
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!