నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకేసులో నెల్లూరు జిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే సిగ్గుపడతాయేమో అన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా జిల్లా ఎస్పీ విజయారావు కట్టు కథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏం ఇనుము ఉందని దొంగలు అక్కడికి వెళ్లారు. కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు!
కోర్టులోని రికార్డు రూములోని పత్రాలతో ఇనుము దొంగిలించే వ్యక్తలకు పనేంటి? ఇనుము దొంగిలించేవారు వాహానాలు లేకుండా దొంగతనానికి వెళతారా? రికార్డు రూమ్ తాళాలు పగలగొట్టి, ఆ గదిలోని ఇతర విలువైన వస్తువులు ఏవీ తాకకుండా , కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలే ఎలా దొంగిలించారో ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు రవికుమార్.
కాకాణి ముద్దాయిగా ఉన్న కేసు ఫైల్లోని పత్రాలు మాత్రమే సదరు ఇనుము దొంగలకు ఎందుకు అవసరమయ్యాయో జిల్లా ఎస్పీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కనీ కనిపించకుండా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ మాత్రమే ఎస్సీ ఎందుకు బయట పెట్టారు? అసలు దొంగలను కాపాడుందుకే జిల్లాఎస్పీ బస్టాండ్ లో పడుకున్న అనామకుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులోని రికార్డు రూములో వేలాది సాక్ష్యాలుంటే కాకాణి కేసు ఫైల్ మాత్రమే ఎందుకు మాయమవుతుంది ఎస్పీగారు?
మంగళగిరిలోని మంత్రి కాకాణి విల్లాలో ఏసీ మెకానిక్ షేక్ మహ్మద్ అనుమానాస్పదంగా ఎందుకు మృతి చెందాడు? ఏసీ మెకానిక్ చనిపోయింది 16వ తేదీ అయితే, 17వతేదీవరకు ఎందుకు చెప్పలేదు? కోర్టు రూములో జరిగిన సాక్ష్యాల దొంగతనానికి, మంగళగిరిలో కాకాణి విల్లాలో మెకానిక్ మృతికి సంబంధం ఉంది. రెండు సంఘటనల మధ్యన ఉన్న సంబంధం ఏమిటో పోలీసులు తేల్చాలి. భూకబ్జాలు, హత్యలు, అరాచకాల్లో మునిగి తేలేవారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి కోర్టులో చోరీ ఘటనే పెద్ద నిదర్శనం. జగన్ కాకాణికి మంత్రి పదవి ఇచ్చి, మరిన్ని దారుణాలు చేయమని ప్రోత్సహించినట్టుందన్నారు కూన రవికుమార్.
Read Also: Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్