చిన్న చిన్నవాటికి క్షణికావేశం పెద్ద సమస్యలను తీసుకువస్తున్నాయి. ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లంగర హౌజ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే కారణంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటన సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ కు చెందిన ఓ యువతి లంగర్ హౌజ్ లో ఉండే రోహన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అయితే యువతి…
దొంగను పట్టుకున్న పోలీసే దొంగ అయితే ఎలా వుంటుంది. హాస్యాస్పదంగా వుంటుంది కదూ.. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే.. చోరీ కేసులో పట్టు పడ్డ ఖాతాలో నుంచి ఓ.. పోలీసు బాసు డబ్బులు కాజేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. ఏకంగా అరెస్టై జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు ప్రబుద్ధుడు.…
సత్యసాయి అనంతపురం జిల్లాలో మహిళపై జరుగుతున్న ఆకృత్యాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒక రేప్ , రెండు మర్డర్ లు, ఒక ఆత్మహత్య, ఓ హత్యయత్నం…. ఇలా నాలుగు రోజులలో వ్యవధిలోనే రెండు జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. తేజస్విని , సరస్వతి దారుణమైన ఘటనలు ఇంకా ముగియకముందే శ్రీసత్య సాయి జిల్లాలో మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తనను ప్రేమించాలని ఓ మైనర్ బాలికను వేధించాడు ఓ యువకుడు. దీంతో తల్లిదండ్రులు బాలికను స్కూల్ మాన్పించారు.…
అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా…
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల. సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో…
సంచలనం కలిగించిన రమ్య హత్య కేసులో న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఉన్మాద వ్యక్తులకు చెంపపెట్టులాంటిదన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చదువుకునే ఆడపిల్ల ను క్రూరం గా హత్య చేయడంతో రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోయారు. ఈ హత్య జరిగిన వెంటనే మా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ ఉదారంగా ఆదుకున్నారన్నారు మంత్రి నాగార్జున. హంతకుడిని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం , అధికారులు బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి…
రాష్ట్రం లో జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగన్ మాయ మాటలకు మహిళలు, కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ దారుణంగా మోసపోయారన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ ను అడ్డు పెట్టుకుని ప్రతి పక్ష నేత చంద్రబాబును భయపెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మాజీ…
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకేసులో నెల్లూరు జిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే సిగ్గుపడతాయేమో అన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా జిల్లా ఎస్పీ విజయారావు కట్టు కథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏం ఇనుము ఉందని దొంగలు అక్కడికి వెళ్లారు. కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు! కోర్టులోని రికార్డు రూములోని పత్రాలతో ఇనుము దొంగిలించే వ్యక్తలకు…
కొంత కాలంగా మన దేశంలో ఆహార అలవాట్లను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన నవరాత్రి సందర్బంలోనూ దానిని చూశాం. పర్వదినాలలో దేశ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసివేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో ఉంచరాదని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే, ప్రగతిశీల వాదులు దానిని కౌంటర్ చేస్తున్నారు. మాంసాహారం పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉత్తర, మధ్య భారత్లో కనిపిస్తుంది. అక్కడ ఈ అంశాన్ని ఒక సమస్యగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని…