Crime News: డెహ్రాడూన్‌లో దారుణం.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!
- డెహ్రాడూన్‌లో దారుణం
- బాలికపై సామూహిక అత్యాచారం
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moradabad Girl Gang Raped in Uttarakhand Bus Stand: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్టాండ్‌లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆగష్టు 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ద్వారా దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఆగష్టు 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట బస్ టెర్మినల్ 12వ నంబరు ప్లాట్‌ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉంది. బాలిక దీన స్థితిని గమనించిన బస్టాండ్‌లోని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్‌కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఆమె జరిగిన విషయం చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
బాలిక ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బస్సు డెహ్రాడూన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక.. ఒంటరిగా ఉన్న బాలికపై ముందుగా డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు అజయ్ సింగ్ చెప్పారు. ఆపై పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు, బస్టాండ్‌లోని క్యాషియర్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!