ఆమె ఓ వివాహిత.. తొలుత సరదా కోసం ఆన్లైన్ రమ్మీ ఆడటం మొదలుపెట్టింది.. తర్వాత అది అలవాటైంది.. అనంతరం ఆ ఆటకి బానిసైంది. ఎంతలా అంటే.. లక్షల్లో అప్పులు చేసింది. నగలు కూడా విక్రయించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆ భారం భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పని చేస్తోన్న భాగ్యరాజ్ కందన్.. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమించి…
హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమ్నీషియా పబ్ రేప్ కేసు మరవకముందే రెండు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానాకు చెందిన ఓ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్, రితేష్ అనే ఇద్దరు యువకులు…
వాడు భర్త కాదు.. నరరూప రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటి భార్యను హీటర్‌తో కొట్టి చంపాడు. ఆ కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకొచ్చాడు. అనంతరం మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్‌తో బాది చంపేశాడు. ఈ దారుణ ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడలోని ఓ మాల్లో పని చేసే సరోజ (21)కు…
ఆ యువతి ఓ అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. తనే సర్వస్వమని నిర్ణయించుకుంది. ఆ అబ్బాయి కూడా యువతిని ప్రేమించాడు. కానీ, పెళ్లి విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విశాఖపట్నం భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొయ్య లావణ్య (16) అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ యువతి అదే గ్రామంలో ఉండే మణికుమార్ని ప్రేమించింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరు.. పెళ్ళి…
భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఓ మహిళ.. శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప (28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు ముందునుంచే నిరూప తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా తమ మాట వినకుండా రాజశేఖర్‌ను పెళ్ళి…
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. చైన్నైలోని తిరునల్వేలి పనకుడి పట్టణంలో ఓ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. అయితే వారికి తెలియక కారు డోర్ లాక్ చేశారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారని దగ్గరలోనే ఉన్న గుడిలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లారు నాగరాజన్ కుటుంబ సభ్యులు.. గుడికి వెళ్లొచ్చిన నాగరాజన్ కుటుంబ సభ్యులు పిల్లల గురించి చూశారు. అయితే ఎంత వెతికిన ఇంట్లో కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లోని కారులో చూడగా.. ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు.…
ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి…
మిస్ట్ కాల్ వస్తే దానిని కట్ చేయడం మానేసి.. అవతలి గొంతు హస్కీగా వుందని మీరు దానికి టెంప్ట్ అయితే అంతే సంగతులు. ఆ స్వరం మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. మహిళా గొంతుతో లక్షల్లో అక్రమ సంపాదనకు తెరతీశాడో ప్రబుద్ధుడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. ఆడ గొంతుతో మగాళ్లను బురిడీ కొట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు మిస్డ్ కాల్ చేయడం… వారితో ఆడ వారి లాగా మాట్లాడడం ఆర్థికంగా…