Massive Road Accident : రెండు బస్సులు ఢీ.. 8మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Bus Accident at Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్వేపై బీహార్ నుండి ఢిల్లీ వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8మంది మృత్యువాత పడ్డారు. అయితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి మరో డబుల్ డెక్కర్ బస్సును ఢీ కొట్టిందని చెబుతున్నారు స్థానికులు.
Also Read
ఈ ప్రమాదంలో బస్సు దగ్ధం కాగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని లక్నో ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్వేపై దెబ్బతిన్న బస్సును క్రేన్ సహాయంతో తొలగించారు పోలీసులు. దీని కారణంగా ఎక్స్ ప్రెస్వేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!