Gudivada Mystery Case: మొదట అబ్బాయి అదృశ్యం.. ఆ తర్వాత ఎదురింట్లో ఆంటీ మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Married Woman In Gudivada Went Missing Along With The Boy: ఇది ఎవ్వరూ ఊహించని, ఎవ్వరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ కేసు. ఆంధ్రప్రదేశ్ గుడివాడలోని గుడ్‌మెన్ పేట కాలనీలో ఈ కేసు వెలుగు చూసింది. అసలు మేటర్ ఏమిటంటే.. ఆ కాలనీలో ఉంటోన్న 15 ఏళ్ల బాలుడు రీసెంట్‌గా అదృశ్యమయ్యాడు. బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ అబ్బాయి.. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. స్నేహితుల వద్దకు వెళ్లాడేమోననుకొని, వారిని సంప్రదించారు. వాళ్లు కూడా తమ వద్ద లేడని చెప్పారు. దాంతో టెన్షన్ పడ్డ బాలుడి తల్లిదండ్రులు.. చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా జాడ కనిపించకపోయేసరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఎదురింట్లో ఉంటోన్న ఆంటీ సైతం మాయమైనట్టు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆమె, బాలుడు అదృశ్యమయ్యాక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో.. ఆ మైనర్ బాలుడు, ఈ వివాహిత మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ, ఆ అబ్బాయి కుటుంబీకుల వాదన మాత్రం మరోలా ఉంది. డబ్బుల కోసమే తమ బాలుడ్ని అపరహరించిందని పేర్కొంటున్నారు. మాయమాటలు చెప్పి, తమ పిల్లాడ్ని ఆమె ఎత్తుకెళ్లిందని చెప్తున్నారు. ఇది కచ్ఛితంగా కిడ్నాప్ వ్యవహారమేనని, ఆ వివాహిత ఆచూకీ కనుగొని తమ పిల్లాడ్ని తమకు అప్పగించాలని బాలుడి తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అటు, పోలీసులకు ఈ కేసు అంతుపట్టడం లేదు. బాలుడి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు.. ఎదురింట్లో ఉండే వివాహిత ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసిందా? లేక స్థానికులు అనుమానిస్తున్నట్టు వాళ్లు ఎఫైర్‌లో ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. వివాహిత ఏవో మాటలు చెప్పి, బాలుడ్ని తీసుకెళ్లి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు.. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని అతని పేరెంట్స్ చెప్తున్నారు. మరి, ఈ మిస్టరీ కేసు ఎప్పుడు వీడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!