మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం ఎంతలా అంటే సొంత కూతురినే చంపుకునేంత. అవునండీ.. మూఢనమ్మకంతో ఓ తల్లి కొడుకు కోసం కూతురినే చంపుకుంది.
కుటుంబసభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి వెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లికి ఆతిథ్యం ఇస్తున్న ఓ రెస్టారెంట్ ముందు గొడవ.. తీవ్రంగా మారి నలుగురు వ్యక్తుల మృతికి దారితీసింది.
విమానాశ్రయాలు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల ముందు బంగారం స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు.
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు.. అడవిని తగలబెట్టొచ్చు.. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా సాంకేతిక ప్రగతిని వినియోగించే పరిస్థితి కూడా అంతే. అశ్లీలం నెట్టింట్లో నుంచి నట్టింట్లోకి వచ్చేస్తోంది.
ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన కుటుంబాన్నే అంతమొందించారు. జీతం ఇచ్చిన యజమాని ఫ్యామిలీని మట్టుబెట్టారు. యువతీ యువకుడు పని చేస్తున్న చోటే ప్రేమ వ్యవహారం నడిపించగా.. అది తెలిసిన యజమాని వారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వారు కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు.