jewelery stolen from a wedding party in Ranchi: ఇంట్లో ఓ వైపు పెళ్లి సందడిగా ఉంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరుపున కుటుంబాలు బంధువులను రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. బంధువుల పలకరింపుల్లో అంతా మరిచిపోయారు. ఇదే అదనుగా ఏకంగా పెళ్లికి సంబంధించిన రూ.20 లక్షల బంగారు అభరణాలను కొట్టుకెళ్లారు దొంగలు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలోని మొరాబాదిలో జరిగింది. పెళ్లిలోకి ప్రవేశించిన ఓ కిలాడీ లేడీ ఏకంగా రూ.20 లక్షల బంగారాన్ని పట్టుకెళ్లింది. ప్రస్తుతం పోలీసులు సదరు మహిళ కోసం వేట కొనసాగిస్తున్నారు.
Read Also: Team India: రిషబ్ పంత్‌కు ఉద్వాసన.. కెప్టెన్ రోహిత్ ఏం చెప్పాడంటే..?
వివారాల్లోకి వెళ్తే మొరాబాది ప్రాంతంలో వివాహ వేడక నుంచి ఓ యువతి బంగారాన్ని కొట్టేసింది. దుపట్టాలో బంగారాన్ని పట్టుకుని వెళ్లింది. అయితే పెళ్లి వేడుకలో అంతమంది ఉన్నా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. తీరా పెళ్లి కుటుంబ సభ్యులు చూసే సరికి బంగారం మాయం అయింది. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ యువతి బంగారాన్ని దుపట్టా కింద పెట్టుకుని బయటకు వెళ్తుండటం కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ కుటుంబం కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించింది. వరుడి ఊరేగింపు సందర్భంగా కుటుంబ సభ్యులు అతిథులను రిసీవ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు గదుల్లోకి వెళ్లి చూడగా.. రూ.20 లక్షల నగలు, కొంత నగదు మాయం అయ్యాయి. నగలు చోరీ చేసిన మహిళ ఎవరో గుర్తించామని.. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి దొంగతనాలు నగరంలో జరగడం ఇదే తొలిసారి కాదు. తాజాగా రాంచీలోని ఓ ప్రతిష్టాత్మక క్లబ్ లో ఓ ఎంపీ నిర్వహించిన పెళ్లి వేడుకల్లో కూడా ఇలాంటి తరహా దొంగతనమే జరిగింది.