Balanagar Crime: వరుసకు బాబాయ్‌లు. ఆ చిన్నారిపై వారి కన్నుపడింది. ఎలాగైనా సరే ఆచిన్నారిపై కామ వాంఛతీర్చుకోవాలని అనుకున్నారు. ఆ టైం కోసం ఎదురు చూసారు. చివరకు ఆ టైం రానే వచ్చింది. బాబాయ్ అంటూ దగ్గరకు వచ్చిన ఆ చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాబాయ్ అంటూ ముద్దు ముద్దు మాటలతో పిలుస్తున్న ఆచిన్నారిపై వారి కామవాంఛ తీర్చుకున్నారు. వారికి సహకరించిన వారు ఇంకా ఇద్దరు కూడా ఆ చిన్నారిపై పశువులా పడి వారి కామదాహాన్ని తీర్చుకున్నారు. అంతేకాకుండా ఆచిన్నారిని అతి కిరాతకంగా హత్య చేశారు. బాబాయ్ లే ఇంతకు కిరాతకానికి ఒడిగట్టడమే కాకుండా మిగతా ఇద్దరిని కూడా ఆ చిన్నారిపై ఆత్యాచారం చేసేందుకు ఉసిగొలిపి హత్య చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Dutee Chand: తన ప్రేయసిని పరిచయం చేసిన ‘గే’ క్రీడాకారిణి
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం తిరుమలగిరి లో దారుణం జరిగింది. గ్రామంలో 9వ తరగతి చదివే విద్యార్థిని పై అత్యాచారంచేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వరుసకు ఇద్దరు బాబాయిలు మరొక వ్యక్తి కలిసి తెల్లవారుజామున అత్యాచారం చేసి ఆపై ఆచిన్నారిని హత్య చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత జరిగింది. బాబాయ్ లే చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడంతో సంచలనంగా మారింది. ఇలాంటి వార్తలు బయట వింటుంటే అయ్యోతల్లి నేనున్నాను అంటూ నాన్న తరువాత నాన్న లాంటి బాబాయ్ లు తోడుగా ఉండాల్సిన సమాజంలో బాబాయ్‌లే ఆచిన్నారిపై పశువులా ప్రవర్తించిన తీరు కుటుంబంలో ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థంకానీ ప్రశ్నగా మారుతుంది. ఇలాంటి కామాపిశాచులు ఉన్నంతకాలం ఈదేశంలో మగువకు న్యాయం జరగదు. ఎన్ని సెక్షన్స్ వచ్చినా ఇలాంటి కామాంధులు మారరు. ఆతల్లి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో అంటూ ఆతల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాబాయ్ అంటూ వారి వద్దకు వెళితే హత్యచేశారంటూ వాపోయారు. న్యాయం చేయాలని పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Shraddha Case: ముందుగా చేతులు.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా.. అఫ్తాబ్ నార్కోటెస్టులో భయంకర విషయాలు