Delhi Man Kills Live-In Partner, Tries To Chop Up Body: శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని షాకుకు గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెను లవర్ అఫ్తాబ్ చంపేశాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధ గొంతు కోసేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. భాగాలను ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. చివరకు శ్రద్ధా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. శ్రద్ధాను హత్య చేయడమే కాకుండా పశ్చాతాప పడటం లేదని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan Cricket Board: ఆసియా కప్ వేదిక మారిస్తే.. టోర్నీని బహిష్కరిస్తాం
ఇదిలా ఉంటే శ్రద్ధా తరహాలోనే ఢిల్లీలో ఓ వ్యక్తి సహజీవనంలో ఉన్న మహిళను చంపేశాడు. పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్ కు చెందిన 35 ఏళ్ల మహిళను చంపినందుకు ఓ వ్యక్తిని పంజాబ్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ హత్య వ్యవహారంలో శ్రద్ధా వాకర్ హత్యను ప్రేరణగా చేసి చంపినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రేఖా రాణి అనే మహిళ మన్ ప్రీత్ తో సహజీవనం చేస్తోంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న మన్ ప్రీత్, రేఖ వాణితో 2015 నుంచి సంబంధం నెరుపుతున్నాడు. అయితే ఆమెతో సంబంధాన్ని తెంచుకోవాలనుకున్న మన్ ప్రీత్ ఆమెను చంపాలని అనుకున్నాడు.
తిలక్ నగర్ లో రేఖ తన 16 ఏళ్ల కూతురుతో నివాసం ఉంటోది. డిసెంబర్ 1న రాత్రి రేఖ కుమార్తెకు నిద్రమాత్రలు వేసి, ఆమె నిద్ర పోయిన తర్వాత రేఖను కత్తితో నరికి చంపాడు. అయితే రేఖ శరీరాన్ని కత్తితో భాగాలు చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. కుమార్తె గుర్తిస్తుందని భయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మన్ ప్రీత్ కిడ్నాపులు, హత్య కేసుల్లో వాంటెడ్ గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రేఖ వాణి కుమార్తె ఫిర్యాదు మేరకు ఐసీసీ 302 హత్యనేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.