ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నా రులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లోని దల్పత్పూర్-కాశీపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులతో పెళ్లికి వెళుతున్న వ్యాన్ను వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది.
ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20 ఏళ్ల మహిళను హతమార్చాడు మేనమామ.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 81 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో శుక్రవారం సాయంత్రం గజోల్ ప్రాంతానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లల్ని చూసేందుకు ఇంటికి వచ్చిన భార్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.