ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియం గార్గ్ (4) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు. అతడు 43 పరుగులు చేశాడు.
Team India: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమ్ ఇదే..!!
మిగతా బ్యాటర్లలో రొమారియా షెపర్డ్ 26 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 25, మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు, ఎల్లిస్ 3 వికెట్లు సాధించారు. రబాడ ఒక వికెట్ తీశాడు. కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటికే పంజాబ్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం నామమాత్రంగా మారింది.