SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(99) ఒంటరి పోరాటంతో పంజాబ్ 143 పరుగులు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. గెలవాలంటే 60 బంతుల్లో 77 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి(41), ఎయిడెన్ మార్‌క్రమ్(3) ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్ కెరీర్‌లోనే శిఖర్ ధావన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులు చేసి కొంచెంలో సెంచరీ మిస్సయ్యాడు. 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధావన్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. అతని ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసి శిఖర్ ధావన్ సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్ బౌలర్లు ఎంతో చక్కగా రాణించడంతో పంజాబ్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేయగలిగారు. ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ సొంత గ్రౌండ్‌లో ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది.