ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ మొత్తం హైలెట్ గా నిలిచింది మాత్రం మన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక్కడే. 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్ హిత్ తో పంజాబ్ బ్యాటర్ ను రనౌట్ చేడయం కూడా విశేషం.
Also Read : KA Paul and Jd Lakshminarayana Live: కేఏ పాల్, జేడీల మధ్య ఆసక్తికర చర్చ
అయితే ఒక రకంగా సిరాజ్ ఐదు వికెట్ల ఫీట్( నాలుగు వికెట్లు + రనౌట్ ) సాధించినట్లే. ఇక పంజాబ్ కింగ్స్ పై నాలుగు వికెట్ల ప్రదర్శన సిరాజ్ కు ఐపీఎల్ లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. మ్యాచ్ ముగిసిన అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. మ్యాచ్ లో తొలి బంతిని షార్ట్ లెంగ్త్ వేశాను.. కానీ తర్వాత నుంచి స్వింగ్ పై నజర్ పెట్టి వికెట్లు తీయాలనుకున్నా.. అది సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది.
Also Read : Gudivada Hot Politics Live:పవన్ పై కొడాలి నాని విమర్శల ప్రభావం ఉంటుందా?
దీంతో లాక్ డౌన్ కు ముందు ఆడిన మ్యాచ్ ల్లో వికెట్లు తీసుకున్నప్పటికీ బౌండరీలు సమర్పించుకునేవాడిని.. దాంతో అందరూ నన్ను టార్గెట్ చేశారు అని సిరాజ్ అన్నాడు. అందుకోసం.. నా ప్లాన్, ఫిట్ నెస్ బౌలింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నా.. ఇక మ్యాచ్ లో నేను డీసెంట్ ఫీల్డర్ నే.. మిస్ ఫీల్డ్ చేయడం సహజం.. కానీ ప్రతీ మ్యాచ్ లోనూ ఫీల్డింగ్ ను సీరియస్ గానే తీసుకుంటా అంటూ ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు.