విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు... క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసామన్నారు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. ఈ ముఠాతో పెద్ద తలకాయలకు సంబంధాలు ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు.. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశించామన్నారు..
విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు.
ఐఎస్ సదన్‌లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ శనివారం రాత్రి ఛేదించి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 25.50 లక్షలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ (సెంట్రల్) జోన్ బృందం మారుతీనగర్ ఐఎస్ సదన్‌లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్దుల్ సోహైల్ (28), మహ్మద్ ఫర్హతుల్లా (55)లను పట్టుకున్నారు. “సొహైల్…
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్‌లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. కదులుతున్న వాహనంలో మొబైల్ ఫోన్లు పెట్టి బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Cricket Betting: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగలా ఉన్న ఐపీఎల్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలను అందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడుతున్నారు.
హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు పరారీలో ఉన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. బాచుపల్లి సాయి అనురాగ్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బుకీలు అడ్డాగా చేసుకున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.