Cricket Betting: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగలా ఉన్న ఐపీఎల్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలను అందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రోజుకూ రూ.2కోట్లకు పైగా చేతులు మారుతున్నాయని సమాచారం. షాద్ నగర్ ఒక్కటే కాదు.. నియోజక వర్గ వ్యాప్తంగా పలు పల్లెల్లో సైతం క్రికెట్‌పై బెట్టింగ్ సాగుతోంది. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో తన మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. తాండకు చెందిన పలువురు ప్రజలు ప్రకాష్ ఆత్మహత్యను చూసి హోరున విలపిస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు చిత్రమైందని భావించి కన్నీరు మున్నీరవుతున్నారు. తాండకు చెందిన ఆంగోతు అమరుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది ప్రకాష్ చిన్న కుమారుడు. ఇలా అర్ధాంతరంగా బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడం తండాను కలచివేస్తుంది.
యువకుడు ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వీర్లపల్లి శంకర్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించారు. ప్రకాశ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. బెట్టింగ్ ముఠా నుండి యువకులను పోలీసులు రక్షించాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతపై ఒక డేగ కన్ను వేయాలని, పోలీసులు ఆ దిశగా ప్రత్యేక కోణం ద్వారా విచారణ జరిపి బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం చలాన్లు ఇతర చిన్నచిన్న నేరాల కాకుండా ఇలాంటి మోసాలపై బెట్టింగ్ లపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకాష్ తల్లిదండ్రులను పరామర్శించారు.
Etela Rajender: నేను అలాంటి వ్యక్తిని కాదు.. బీజేపీ నేతలపై ఈటెల కీలక వ్యాఖ్యలు