వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు.…
దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది. Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..? అధిక వేడి కారణంగా, ఒక కోతి…
అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది.
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్లిన, గుండెపోటు వచ్చిన చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం చేయకుడదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్.
గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు…
గుండెపోటు కారణంగా గుజరాత్‌లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.