TS State Emblem: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత..
MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు..
ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు.