ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. "మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది..…
CPI Party: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా…
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు…
రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్‌లో డా బీఆర్ అంబేద్కర్‌ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్‌పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ…
CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి చేశారు. ఇక, తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు తాగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఎర్రన్నల మధ్య ఏకాభిప్రాయం లేదా? సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం ఉందా? ఒక కార్యక్రమం విషయంలో పరస్పరం మాట్లాడుకోకుండా… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఆయనో రకం, ఈయనో రకం అన్నట్టు రెండు కమిటీల్లోని ముఖ్యులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోంది? హైదరాబాద్‌లో ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అలాగే… అంతకు ముందు రోజు.. ప్రొఫెసర్ సాయిబాబా…
అలయ్ బలయ్పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.
అలయ్ బలయ్పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.