కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.
CPI Narayana: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ స్వల్ప అనారోగ్యాన్ని గురయ్యారు. ఆయనకు పరిశీలించిన ఏఐజి డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
సీఏఏపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాజ్యసభ ఎంపీ, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం గురువారం అన్నారు. సీఏఏ అమలును సవాల్ చేస్తూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు తెలంగాణ వచ్చారా? లేదా రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా? అని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్నగా కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా? లేదా? ఎన్నికల ముందే చెప్పాలని, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే…
కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం అని కూనంనేని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ స్నేహం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలని, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘ప్రజపంథా…