MLA Kunamneni: శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
జగన్ హోల్ సేల్‌గా చేస్తే.. చంద్రబాబు రిటైల్‌గా చేస్తున్నాడు.. పెద్ద తేడా ఏమీ లేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ప్రస్తుతం రాజకీయాల్లో నీచమైన భాష నడుస్తోంది.. పోలీసు అధికారులను జగన్ తిట్టారు.. మీరు అధికారంలో వున్నప్పుడు ఏం చేశారు..? అని ప్రశ్నించారు.. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసు లేకుండా అరెస్ట్ చేశారు... ఎంపీని ఇబ్బంది పెట్టారు..
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుడన్న మీరు జగన్ ను మించిపోయారు అప్పు తేవడంలో.. రాష్ట్ర అప్పుల పైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు అని చెప్పి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
సీపీఐ నేత నారాయణ హెచ్‌సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్‌సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు…
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు…
MLA Kunamneni: బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ, ఆ ఆశలు తీరే విందంగా లేదు.. కేవలం కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం.. అలా తీరాలంటే మంత్రదండం కావాల్సి ఉంటుంది.
Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ లో స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలపై…
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు.
MLC Nominations: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి…
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు.