How Would Rajinikanth Look Without Makeup Said CPI Narayana: కలామ్మకు సేవ చేసే కార్మికులందరూ రోడ్డున పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదని.. కార్మికులు పని చేస్తేనే వారికి పేరొస్తుందన్నారు. హీరోలకు కోట్లలో పారితోషికాలా?, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. హీరో, హీరోయిన్‌లకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా? అని మండిపడ్డారు. ‘సూపర్ స్టార్’ రజనీకాంత్…
భద్రాద్రి జిల్లాకు హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను... ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్‌డ్. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా... అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే.. నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీ బిజీగా ఉండేవారు. కానీ...మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యమాల తీరు కూడా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని.. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
MLA Kunamneni: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు…
క్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణి వైఖరితో కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.