మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతుండటంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు నష్టమేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్తపడాలని నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా…